తెలంగాణ సాయుధం రైతాంగ పోరాట యోధుడు అమరజీవి కామ్రేడ్ బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు.బుధవారం మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో రామారావు 21 వ వర్ధంతి సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించారు .అనంతరం సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి నందిగామ సైదులు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ములకలపల్లి రాములు మాట్లాడుతూ.. విద్యార్థి దశలో తన చదువుకు స్వస్తి చెప్పి విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడై ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించాలని కొనియాడారు.రామారావు డివిజన్ రైతు సంఘం అధ్యక్షుడిగా సింగిల్ విండో చైర్మన్ గా గ్రామ సర్పంచిగా సుదీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా పనిచేశారని వారు గుర్తు చేశారు. కొక్కిరేణి గ్రామ అభివృద్ధిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని వారన్నారు. ఎన్నో నిర్బంధాలను అధిగమిస్తూ ప్రజల బాధలను తన బాధగా భావించి గ్రామంలో ఉన్న పేద ప్రజలందరికీ ఇథోతికంగా సహకరించిన గొప్ప దానం కర్ణుడు రామారావు అని ఆయన అన్నారు. అలాంటి మహానుభావుడు ఆశయ సాధన కోసం మనమందరం ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. పాలకవర్గాలు తన అవసరాల కోసం ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ఆ వాగ్దానం లో అమల్లో పూర్తిగా విఫలం అయ్యారని వారి విమర్శించారు .పాలకవర్గ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరిని సమీకరించి ఉద్యమించడమే రామారావు కి నిజమైన నివాళిని వారన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు మెదరమట్ల వెంకటేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ముత్యాలు, వట్టేపు సైదులు ,సింగల్ విండో చైర్మన్ చందా చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు రేఖ లింగయ్య ,గ్రామ మాజీ సర్పంచ్ రావులపెంట వెంకన్న, మాజీ ఉపసర్పంచ్ రావులపెంట బ్రహ్మం,సిపిఎం గ్రామ నాయకులు నిడిగొండ శంబయ్య ,ములకలపల్లి సైదులు, ఇంటూరు హుస్సేన్, మామిడి గురుమూర్తి, ములకలపల్లి నాగరాజు, డివైఎఫ్ఐ నాయకులు ఒట్టేపు చిన్న సైదులు ,తదితరులు పాల్గొన్నారు.