రాయికల్ మండలం రామాజీపేట వెలమ సంక్షేమ మండలి సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని ఎమ్మెల్యే క్వార్టర్లో శనివారం కలిశారు. ఈసందర్భంగా రామాజీపేట గ్రామంలో వెలమ సంక్షేమ సంఘం సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిదుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆయిల్నేని సాగర్ రావు,రామాజీపేట సంఘం అధ్యక్షులు దుగ్యాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జకిలేటి హరీష్ రావు, ఉపాధ్యక్షులు ఏనుగు వినోద్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, ఉప కార్యదర్శి అన్నమనేని శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు రవీందర్రావు ,లక్ష్మణరావు, అజయ్ రావు ,రాజశేఖర్ రావు, కిరణ్ రావు తదితరులు పాల్గొన్నారు.