హత్నూర మండలం సిరిపురం గ్రామం లో ఎమ్ ఎన్ ఆర్ ఆసుపత్రి సౌజన్యంతో మెద్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు శనివారం నిర్వహించారు. మేడ్వాన్ డైరెక్టర్ హెచ్ మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రజల ఆరోగ్యాలని కాపాడాలని సద్ ఉద్దేశంతో జిల్లాలో ఎమ్ ఎన్ ఆర్ హాస్పిటల్ వారితో కలిసి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచితంగా టెస్టులు నిర్వహించి మందులు , అవసరం ఉన్న వారికి ఉచిత శాస్త్ర చికిత్స లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ మెడికల్ క్యాంప్ లో దాదాపు 150 మంది ఓపి పరీక్షలు నిర్వహించగా పదిమందికి శాస్త్ర చికిత్స ని నిమిత్తం ఎమ్ ఎన్ ఆర్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం జరిగిందనీ అన్నారు. ఎం ఎన్ ఆర్ ప్రతినిధి సామెన్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా సరే మారుమూల గ్రామాలలో నిరుపేదలకు ఉచితంగా క్యాంపు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. స్థానికులు మాజీ ఎంపీటీసీ మచ్చ నరేందర్ మాట్లాడుతూ పేదలకు ఉచితంగా ఎమ్ ఎన్ ఆర్ వారు కృషి చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు మెడ్వాన్ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
previous post