Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పోలీసు పనితీరును ప్రజలు ఆన్లైన్ నందు తెలుపవచ్చు

పోలీసు అందిస్తున్న సేవల పై ప్రజలు వారి అభిప్రాయం తెలియజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చినది అని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం నందు క్యూఆర్ కోడ్ పోస్టర్ అను అదనపు ఎస్పీ నాగేశ్వర రావు,డిసిఆర్బి డీఎస్పీ మట్టయ్య లతో కలిసి అవిస్కరించారు. ఈ క్యూఆర్ ఇంటర్నెట్ మద్యమాల ద్వారా స్కాన్ చేసి వివరాలు నమోదు చేయవచ్చు అని తెలిపినారు. సిటిజన్ ఫీడ్బ్యాక్ ను తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ను ప్రారంభించడం జరిగింది. గతంలో పోలీసుల సేవలపై పిర్యాదుదారుల కు ఫోన్ చేసి అభిప్రాయాలు సేకరించేవారు. ప్రస్తుతం ఈ క్యూఅర్ కోడ్ ము స్కాన్ చేసి పిటిషన్, ఎఫ్ఐఆర్, ఈ చలాన్, పాస్పోర్ట్ ధ్రువీకరణ మరియు ఇతర అంశాలపై, పోలీసు అధికారుల ప్రతిస్పందన మరియు ప్రవర్తన వారి అభిప్రాయాలను నమోదు చేయవచ్చును. పోలీస్ స్టేషన్లో మరియు అధికారులు సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో రేటింగ్ చేయబడతారని తెలియజేశారు. ఈ విధానం పోలీసు సిబ్బందిలో బాధ్యత పారదర్శకతను పెంచుతుందని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ ప్రతి పోలీసు కార్యాలయం నందు ఈ క్యూఆర్ కోడ్ను ప్రజలకు అందుబాటులో ఉండేదా ప్రదర్శిస్తామన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లలో ప్రజలకు సులభంగా కనిపించే విధంగా రిసెప్షన్ సెంటర్, స్టేషన్ హౌస్ అధికారి రూమ్ నందు, ప్రజలు వేచి ఉండే గది నందు, బయటి ప్రవేశ ద్వారం వద్ద అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు,డిసిఆర్బి డీఎస్పీ మట్టయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, ఐటీ కోడ్ ఆర్ ఎస్ ఐ రాజశేఖర్ సిబ్బంది ఉన్నారు.

Related posts

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం

Harish Hs

సాయి గాయత్రి విద్యాలయాలు ఘనంగా జరుపుకున్న రంగోలి ఉత్సవాలు

Harish Hs

తెలంగాణ నేటి నుంచే గ్రూప్ 3 పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!!

TNR NEWS

ఆర్ అండ్ ఆర్ కాలనీ పల్లెపహాడ్ లో …. చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కు భూమి పూజ  – గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

TNR NEWS

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి

TNR NEWS

*కార్తీక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి దంపతులు..*

Harish Hs