వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు వాణిజ్య బ్యాంకులకు దీటుగా అన్ని రకాల రుణాలు మంజూరు చేసి సహకార సంఘాలు అభివృద్ధిలో ముందుండాలని టెస్కాబ్ అధికారులు విజయ శంకర్, సంపత్ కుమార్ లు తెలిపారు. గురువారం కోదాడ పట్టణంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని శిక్షణలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న పిఎసిఎస్ ఉద్యోగులతో కలిసి సందర్శించారు. అనంతరం చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వ్యవసాయ రుణాలు మాత్రమే కాకుండా ఎంఎస్ఏంఇ పారిశ్రామిక, గృహభివృద్ధి, వర్తకులకు అప్పులు, క్యాష్ క్రెడిట్ లు, విద్య రుణాలు, వ్యవసాయేతర అప్పులు, మల్టీపర్పస్ రుణాలు బ్యాంకు ద్వారా మంజూరు చేస్తే సంఘాలు అభివృద్ధి బాటలో నడుస్తాయని తెలిపారు. రైతులు, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది అందరి సమిష్టి కృషితోనే సంఘాలు అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు. అనంతరం కోదాడ సంఘం నిర్మించిన గోదాములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య, చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ బుడిగం నరేష్, ఏజిఎం పి వెంకటేశ్వర్లు, మేనేజర్ అశోక్, ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్లు గుండా పునేని ప్రభాకర్ రావు, పార్వతి, సీఈఓ మంద వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు………..

previous post