November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలి

ప్రమాదాల బారిన పడకుండా ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సూచించారు.నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీస్,రవాణా శాఖల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన ఈ ర్యాలీని గవర్నమెంట్ మెడికల్ కళాశాల కూడలి ఎన్టీఆర్ పార్క్ దగ్గర బైక్ ర్యాలీను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయాలలో విలువైన నిండు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న వారు నిండు ప్రాణాలను కోల్పోతుండగా, వారి ‌ కుటుంబాలకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చిన్నచిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చవద్దని హితవు పలికారు.రోడ్డు దుర్ఘటనలలో అత్యధికంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతోమంది క్షతగాత్రులు గా మారుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90 శాతం వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని సూచించారు. ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటివారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలలోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, నిబధనల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేస్తున్నప్పటికీ, ఎవరికివారు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్లెం వేయవచ్చని సూచించారు. హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితం అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచ్రక్ర వాహనదారులకు శిరస్త్రాణం ధరించాల్సిన అవశ్యకతను తెలియజేస్తూ, సూర్యాపేట టూవిలర్స్ అసోసియేషన్ వారు అందజేసిన హెల్మెట్ లు కలేక్టర్ అందజేశారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందించారు. అనంతరం ర్యాలీ ప్రాధాన వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఆర్ టిఓ సురెష్ రేడ్డి, ఎం.వి.ఐ లు యస్ .జయప్రకాష్ రెడ్డి , ఎ.ఆధిత్య ,ఎయమ్విఐలు , సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్ తదితర అంశాల గురించి అవగాహన జిల్లా పరిషత్ హై స్కూల్ ఎడ్యుకేషన్ హబ్ విద్యార్థులకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించుకొని ఇష్టంగా చదువుకోవాలి గజ్వేల్ షీ టీమ్ ఏఎస్ఐ శ్రీరాములు

TNR NEWS

జాతీయ విద్యా దినోత్సవం

TNR NEWS

అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం…. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS

భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులది ‌

TNR NEWS

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

Harish Hs

రహదారి భద్రత సమాజంలో అందరి బాధ్యత…..  రహదారి భద్రత నిబంధనలు పాటించండి ఆనందంగా జీవించండి……… టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మునిసిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్….. కోదాడ రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు ప్రారంభం

TNR NEWS