వినియోగదారులకు నాణ్యతతో కూడిన సేవలందించినప్పుడే వ్యాపారానికి వన్నె తీసుకొస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన విజయ టెక్స్ టైల్స్ షోరూంను వారు ప్రారంభించి మాట్లాడారు. కోదాడ నుంచి హైదరాబాద్, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా కోదాడ పట్టణంలోనే అందరికీ అందుబాటులో ఉండేలా ఆకర్షణీయమైన డిజైన్ల వస్త్రాలతో ఏర్పాటుచేసినందుకు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. నమ్మకంతో, నాణ్యమైన సేవలందించి వినియోగదారుల మన్ననలు పొందాలన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, డాక్టర్ సుబ్బారావు, చిలకమూడి విజయ్ కుమార్, శ్రీనివాసరావు, విశ్వేశ్వరరావు, రామినేని శ్రీనివాసరావు, రామినేని లక్ష్మీనారాయణ, చిలకమూడి రవి కిరణ్, సుంకరి బిక్షం, ధనుంజయ రావు, మల్లేపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు……
previous post