మోది మూడవ సారి అధికారం లోకి వచ్చిన తర్వాత కూడా కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికులను దెబ్బ తీసే విధానాలు అవలభిస్తున్నారని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం సాయి బాబు అన్నారు..
శనివారం నాడు సీఐటీయూ జిల్లా కార్యాలయం లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటి సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ కాలం లో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడులను తెచ్చారని, 8గంటలు పని దినాలు లెకుండా చేసి తిరిగి 12 గంటల పని విధానాలు అమలు చేయాలని బిజెపి చేస్తుందన్నారు… మోది ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ప్రవేశ పెట్టే 50 లక్షల కోట్ల బడ్జెట్ లో కార్మికులకు కనీస వేతన చట్టం అమలు కు ఎంత బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారో, స్వామి నాథన్ సిఫార్సులు అమలు చేస్తున్నారా లేదా, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టం అమలు కు ఎన్నీ నిధులు కేటాయిస్తారో చూసి దేశా వ్యాపితంగా కార్మిక, రైతూ, వ్యవసాయ కార్మికులను ఐక్యంగా దేశా వ్యాపితంగా పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు…
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డుకు నిధులు కేటాయింపులో కేంద్రం జాప్యం చేస్తోంది అన్నారు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత టిఆర్ఎస్ ప్రభుత్వం లాగానే కార్మిక సంఘాల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అని సాయి బాబు విమర్శించారు.. ప్రభుత్వము నిర్వహిస్తున్న సలహా మండలి లో కార్మిక సమస్యలపై నిరంతరం పొరాటం చేసే సీఐటీయూ ప్రాతినిధ్యం లేకుండా చేయడం నియంత పోకడలకు నిదర్శనమని ఆయన అన్నారు..
రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాంబాబు, నెమ్మాది వేంకటేశ్వర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆనంతుల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి యాల్కా సోమన్న గౌడ్,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీనివాస్ బాలాజీ నాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు