కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సభ్యుడు ముండ్రా వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటు అని పబ్లిక్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పట్టాభిరెడ్డి, బొల్లు రాంబాబులు తెలిపారు. మంగళవారం క్లబ్ లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ముండ్ర వెంకటేశ్వరరావు సంతాప సభను ఏర్పాటు చేసి క్లబ్ సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెంకటేశ్వరరావు మృతి సమాజానికి తీరని లోటు అని కోదాడ పబ్లిక్ క్లబ్ అభివృద్ధికి ఆయన శక్తి వంచనా లేకుండా కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పట్టాభి రెడ్డి,బొల్లు రాంబాబు, యలగందుల నరసయ్య, ఉపాధ్యక్షులు వేనేపల్లి సత్యనారాయణ, ఆవుల రామారావు, నాగార్జున, మేకల వెంకట్రావు, తోట రంగారావు, సీతారాం రెడ్డి, శివాజీ, మాధవరావు, హరిబాబు, పుల్లయ్య, చింతలపాటి చంద్రశేఖర్, సుంకారి సత్యనారాయణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు………..