క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణ పరిధిలోని కటకొమ్ముగూడెం రోడ్డులో ఉన్న మైదానంలో కత్రం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కోదాడ నియోజకవర్గస్థాయి ప్రీమియర్ లీగ్ 3 పోటీలో విజేతలకు కత్రం శ్రీకాంత్ రెడ్డి తో కలిసి బహుమతులను అందజేసి మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి విజయానికి నాంది కావాలన్నారు. కోదాడలో స్టేడియం ఏర్పాటుకు తన వంతు తప్పక కృషి చేస్తా అన్నారు. కోదాడ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి కత్రం శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.ఐదు రోజులపాటు నిర్వహించిన ఈ ప్రీమియర్ లీగ్ లో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 30 టీములు పాల్గొనగా ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులతో పాటు నగదు ప్రోత్సాహాకన్ని అందజేశారు. ప్రథమ స్థానం మస్తాన్ 11 కోదాడ జట్టు నిలవగా ద్వితీయ స్థానం సోమేష్ 11 టీం కోదాడ, తృతీయ స్థానం అనంతగిరి మండలం కిష్టాపురం గ్రామం కత్రం టీంలు విజేతలుగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్ జానీ, ఎంఈఓ సలీం షరీఫ్,కత్రం కిరణ్ కుమార్ రెడ్డి, ముడియాల సత్యనారాయణ రెడ్డి, ముడియాల బాబి, సి సి రెడ్డి హెచ్ఎం ఆన్ జ్యోతి ఈదుల కృష్ణయ్య,ముత్తవరపు రామారావు, చింతా మాధవరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు……….