పల్లెల్లో ప్రజలందరూ ఐక్యంగా ఉంటూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటా రమేష్ పిలుపునిచ్చారు ఈరోజు మునగాల మండలం నరసింహులగూడెంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సిపిఎం డివైఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నరసింహుల గూడెం అమరవీరుల జ్ఞాపకార్థం ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్ టీవీలు వచ్చి గ్రామాలలో సోషల్ మీడియా ద్వారా ప్రజల మధ్య వైశ్యామ్యాలు సృష్టిస్తూన్న నేటి తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో పండుగల సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడటం కోసం ఇలాంటి ముగ్గులు పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు నరసింహులగూడెం గ్రామంలో ప్రజలందరినీ ఏకతాటిమీదికి తెచ్చి పండుగల సందర్భంగా ముగ్గుల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సిపిఎం పార్టీకి సాధ్యమని అన్నారు.గ్రామంలో పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ముదిరెడ్డి ఆదిరెడ్డి,ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి,బొంత శ్రీనివాస రెడ్డి,జూలకంటి పులిందర్ రెడ్డి ముందు భాగంలో ఉన్నారని అన్నారు.యువజన సంఘం పేరుతో గ్రామాలో కబడ్డీ పోటీలు నిర్వహించి గ్రామీన క్రీడలను ప్రోత్సహించారని అన్నారు నాటి అమరవీరులు చూపిన బాటలో పయనిస్తూ వారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుతూ అనేక ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు పండుగల సందర్భంగా పల్లెల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించడం మూలంగా మహిళలు చైతన్యవంతంగా తమలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడం కోసం ఈ ముగ్గుల పోటీలు ఉపయోగపడతాయని అన్నారు ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమపంగు నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి నరసింహులగూడెం గ్రామానికి చెందిన క్లాస్ 1 సివిల్ కాంట్రాక్టర్ కుంచం నరసయ్య సిపిఎం అనంతగిరి మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ సిపిఎం గ్రామ కమిటీ కార్యదర్శి జూలకంటి కొండారెడ్డి శాఖా కార్యదర్శులు మారం వెంకటరెడ్డి, బొంత స్వరూప, నందిపాటి శేఖర్,మొగిలిచెర్ల సీతారాములు,సిపిఎం గ్రామ నాయకులు పిడమర్తి అబ్రహం,ఉయ్యాల కొండయ్య,తోట సోమయ్య, కొప్పుల నారాయణ, మొగిలిచర్ల రమేష్,ఉబ్బపిల్లి సత్యనారాయణ,జూలకంటి శ్రీనివాస్ రెడ్డి,సోమపంగు గురవయ్య,వెంకటేశ్వర్లు,పోకల మైసయ్య,DYFI గ్రామ అధ్యక్షులు ఖాసీమల్లి గ్రామ కార్యదర్శి సోమపంగు సూర్యతేజ నాయకులు కోడి సత్యనారాయణ,మదార్,గోపి, చిర్ర సాగర్ తదితరులు పాల్గొన్నారు.