మునగాల మండల పరిధిలోని కలకోవగ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బుర్రి మల్లయ్య, తిప్పని సంతోష్, ల జ్ఞాపకార్థం కలకోవ గ్రామస్థాయి క్రికెట్ క్రీడోత్సవాలను ప్రారంభించి నిర్వాహకులు మాట్లాడుతూ, బుర్రి మల్లయ్య,తిప్పని సంతోష్, లు మన గ్రామంనుండి మండలం జిల్లా రాష్ట్ర స్థాయిలో మన గ్రామాన్ని మంచి పేరు తెచ్చి క్రీడలు ఆడి బహుమతులు పొందిన క్రీడాకారులు,వారులేనిలోటు మన గ్రామానికి తీరనిలోటని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ,మనగ్రామంలో సంక్రాంతిపండుగసందర్భంగా ఈ గ్రామస్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించడం జరిగిందని,వారు అన్నారు ఈ క్రీడల్లో గెలుపొందిన వారు వివరాలు కలకోవ మొదటి బహుమతి లెజెండ్ టీం,3016/ రెండో బహుమతి లెవెన్ బుల్లెట్ టీం2016/, మూడో బహుమతి అమర్ గాని సందీప్ మెమోరియల్ టీం1016/, నాలుగో బహుమతి ఎం ఎన్ టీం516/, ఐదవ బహుమతి516/బహుమతులతోపాటు మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి వారికి సీల్డ్ అందజేయడం జరిగిందని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.ఈకార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

previous post