సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి పండుగ అని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని 34 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గంధం యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు పెట్టి మహిళలు అందరికీ బహుమతులు అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో 34 వార్డ్ కౌన్సిలర్ గంధం యాదగిరి, రాష్ట్ర నాయకులు మహబూబ్ జానీ, ఎర్నేని బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, ఏపూరి రాజు, చింతాబాబు మాదిగ, కాంపాటి శ్రీను, గుండె పంగు రమేష్,సోమపొంగు పార్వతి తదితరులు పాల్గొన్నారు…………
previous post