కోదాడ పట్టణంలోని స్థానిక మాస్టర్ మైండ్స్ పాఠశాలలో శనివారం గణిత దినోత్సవం ను నిర్వహించుకున్నారు.
గణిత ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు చాలా బాగున్నాయి అని, ప్రతిభ అభినందనీయమని పాఠశాల ప్రిన్సిపాల్ పీ కిరణ్ కుమార్ అన్నారు. గణిత పితామహుడు శ్రీరామానుజన్ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణితం పై ఆసక్తి ఉంటే రాణింపు సులభమేనన్నారు. అన్నింటికంటే గణితమే సులభంగా నేర్చుకోవచ్చు అన్నారు ఎగ్జిబిషన్లో నమూనాలని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు శ్రీవిద్య, ప్రమోద్, శ్రీనివాస్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు