పండగల పేరుతో స్మార్ట్ ఫోన్లకు వచ్చే అనవసరమైన ఫైళ్లు, మెసేజ్లను ఓపెన్ చేయవద్దని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. పండగ డిస్కౌంట్లు, రీఛార్జిలు, ఏపీకే ఫైల్స్, బోనస్ పాయింట్లు, తదితర పేర్లతో స్మార్ట్ ఫోన్లు కు
మెసేజ్లు లింకులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. వాటిని ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుందన్నారు.వాటి విషయంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.