విద్యార్థుల్లో గుణాత్మక విద్యను, అభ్యాసన సామర్ధ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో పనిచేయాలని మండల విద్యాధికారి మహతి లక్ష్మి సూచించారు. బుధవారం మండలంలోని వడ్లూరు బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ హెడ్మాస్టర్, ఉపాధ్యాయుల సమక్షంలో STU నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో STU జిల్లా ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు నా రోజు శంకరాచారి, ఉపాధ్యాయులు పుల్లూరి ప్రభాకర్, శ్రీరామ్ శ్రీనివాస్, రాజేందర్, నరసింహారెడ్డి, తిరుపతి, రేణుక, రూప తదితరులు పాల్గొన్నారు.
previous post