కోదాడ డివిజన్ పరిధిలో ఇటీవల పదోన్నతి పొందిన మాదిగ ఉద్యోగులకు ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదాడ ఎంఎల్ఏ ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా, పదోన్నతి పొందిన ఉద్యోగస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు, అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పై చర్చిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బట్టు మల్లయ్య, మోలుగూరి వెంకయ్య, మాతంగి మనోజ్, ఏపూరి పర్వతాలు, నందిగామ ఆనంద్,చేకూరి రమేష్, బోలికొండ కోటయ్య, గంధం బుచ్చరావు, మాదాసు బాబు, ఎంఎస్పి నాయకులు ఏపూరి రాజు, కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, ఎంజేఎఫ్ నాయకులు నాయకులు పడిశాల రఘు, జిల్లా నాయకులు తోటపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post