Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సినిమా ట్రైలర్ ఆవిష్కరణ

అసెంబ్లీ ప్రాంగణంలో సలాం సైనికా సినిమా ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ ట్రైలర్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 14న సలాం సైనికా చిత్రం విడుదల కానుంది. సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తన భావన అని.. ఈ సినిమాలో 200 మంది కొత్త నటులు నటించారని, సినిమా అంతా ఏపీలోనే నిర్మించారన్నారు. సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలకు తమ ప్రోత్సహం ఉంటుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. త్రివర్ణ పతాకాన్ని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత ప్రాంతాలకు అతీతంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని, కుల, మతాలు, ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. పేదవాడికి ఓ చదువు, లేనివాడికి ఓ చదువు అందుతుందని, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని అందరూ గ్రహించాలన్నారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని, పాఠ్యాంశాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలని మోషేన్ రాజు అన్నారు.

Related posts

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

గొల్లప్రోలులో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు – చోద్యం చూస్తున్న అధికారులు

ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

రియాన్స్‌ క్లినిక్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

ఏపీలో బీచ్‌లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ

TNR NEWS