తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆరు గ్యారెంటీ ల హామీలో. భాగంగా నాలుగు పథకాలను ఆర్భాటంగా ప్రకటించి నిన్న జనవరి 26 తారీఖున లాంఛనంగా ప్రారంభించి మా గ్రామమైన తాడువాయిలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంచుకొని. ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు కానీ అందులో చాలామంది పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ఒంటరి మహిళలకు. వారు ప్రకటించిన లిస్టులో పేర్లు లేకపోవడం బాధాకరమని మండల బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కోల ఆంజనేయులు. ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఆంక్షలు లేకుండా అందించాలని. జాబ్ కార్డుతో పని దినాలతో సంబంధం లేకుండా. అందించాలని అధికారులు నిబద్ధతతో పనిచేసే అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి అన్యాయం జరగకుండా చూడాలని. లేనిచో బాధితుల పక్షాన పోరాటాలకు సిద్ధమని అన్నారు