సూర్యాపేట: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ ప్రవేశపెట్టిన రూ.50,65,345 కోట్ల బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు, బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ లో కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో దేశంలో ఉన్న 40 కోట్ల మంది కార్మికుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు నిధులు కేటాయింపులు మొండి చేయి చూపారని విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద సంవత్సరానికి రెండు కోట్ల ఇండ్లను నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో అందుకు తగిన విధంగా నిధులు కేటాయించలేదని విమర్శించారు. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగురి గోవింద్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న, జి ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, సిఐటియు జిల్లా నాయకులు వల్లపు దాసు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.