Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని సోమవారం ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఏపీవో శ్రీనివాస్ పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలావుందీ అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడుతూ విద్యార్థులు తినే భోజనం వండే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు తెలిపారు. భోజనం నాణ్యత విషయంలో ఎటువంటి ఫిర్యాదులు వచ్చిన ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు.ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని విద్యార్ధులకు అందించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Related posts

మల్లన్న సన్నిధిలో కార్తీక పున్నమి వేడుకలు

TNR NEWS

సహాయ పరికరాల దరఖాస్తూ గడువు జూన్ 30 వరకు పొడగించాలి నోటిఫికేషన్ సవరించకుంటే ఆందోళన చేస్తాం.  ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ఉపాధ్యక్షులు జేర్కోని రాజు డిమాండ్

TNR NEWS

కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో కార్తీక ఏకాదశి ఉత్సవం

TNR NEWS

క్యాబినెట్ లో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లు ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం

Harish Hs

అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…….

TNR NEWS

పట్టణ భూమిలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింప చేయాలి.  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవిందు, సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS