కోదాడ పట్టణంలోని 34, 35 వార్డుల్లో డీలర్ షాప్ నెంబర్ 9 డీలర్ ఎర్ర లక్ష్మి రేషన్ దుకాణంలో ప్రతిష్టాత్మక సన్న బియ్యం పథకం టి పి సి సి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి లు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉగాది, రంజాన్ పండుగల తర్వాత సన్న బియ్యం పండుగ జరుగుతుందన్నారు. పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సన్న బియ్యం పథకం దేశంలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు, షేక్ బషీర్, కందుల కోటేశ్వరరావు,వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్ గంధం యాదగిరి, గంధం పాండు, చింత బాబు మాదిగ, గుండె పొంగు రమేష్, ఎర్ర శ్రీనివాసరావు, ఎర్ర వంశీ, ఏర్ర నాగభూషణరావు, అంజని పలువురు నాయకులు పాల్గొన్నారు……..

previous post
next post