మునగాల మండల పరిధిలోని నరసింహా పురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఇటీవల కులగనన సర్వే చేసి దాని ప్రకారం. రిజర్వేషన్లను కేటాయించాలని. రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో తీర్మానించే సందర్భముగా. అట్టి కులగణన సర్వే ప్రకారం ఓసీలు 16 శాతం ఉందని తేలింది కాబట్టి. మిగిలిన వారికి వారి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లను కేటాయించిన విధంగానే ఓసీలకు కూడా 16% రిజర్వేషన్లను కేటాయించి వారికి కేటాయించిన స్థానాలలో వారే పోటీ చేసే విధంగా చట్టం తేవాలని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో 16% కలిగి ఉన్న ఓసి జనాభా లో. ఎంతోమంది గ్రామాలలో వారి వారి స్థాయిని బట్టి. గ్రామాల అభివృద్ధికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి. తమ వంతు కృషి చేస్తూ సామాజిక సేవలో ముందుంటూ. నిత్యం ప్రజా సేవలో ఉంటూ ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పిస్తూ. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే వారికి. చట్ట ప్రకారం రిజర్వేషన్లలో అధిక స్థానాలు కేటాయించిన. దానిని జనరల్ స్థానాలుగా కేటాయించడం వల్ల అన్ని వర్గాల ప్రజలు పోటీ చేసే అవకాశం ఉన్నందువల్ల. వారికి తగిన రీతిలో పోటీ చేసే అవకాశం దక్కకపోవడం వల్ల వారు రాజకీయంగా ఎదగలేక. నష్టపోతున్నారు కావున ఇటీవల ప్రభుత్వం చేసిన కుల గణన ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లను కేటాయించినట్లు గానే. ఓసీలకు. వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లను కేటాయించి వారికి కల్పించిన స్థానాలలో వారు మాత్రమే పోటీ చేసే విధంగా చట్టం చేసి మిగిలిన రిజర్వేషన్లను ఓపెన్ కేటగిరీలుగా. కేటాయించాలని. అప్పుడే. అందరికీ సమ న్యాయం జరుగుతుందని. ఈ దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేసి అమలు చేయాలని. ఏ ఒక్కరికి స్థానిక సంస్థల ఎన్నికలలో అన్యాయం జరగకుండా చూడాలని అన్నారు