దళితులు అనే నెపంతో మధ్యాహ్న భోజన వంట కార్మికులను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ముగ్గురు దళిత మహిళలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.
శనివారం స్థానిక నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేసేటటువంటి ముగ్గురు దళిత మహిళా కార్మికులను దళితులు అనే నెపంతో తొలగించడం ముమ్మాటికి కుల వివక్షతనేని అన్నారు.
మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సంబంధిత పాఠశాలకు వెళ్లి సమగ్రమైనటువంటి పరిశీలన చేయగా అక్కడ బోధించేటువంటి ఉపాధ్యాయులకు మధ్యాహ్న సమయంలో బాయిల్డ్ ఎగ్ ఇవ్వడం లేదనే కారణంతో అక్కడ విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లిదండ్రులను ఉసిగొల్పి దళిత మహిళలకు భోజనం సక్రమంగా వండటం రావడం లేదని ఫిర్యాదు చేయించి విధుల నుండి తొలగించడం జరిగిందన్నారు.అమ్మా ఆదర్శ కమిటీ చైర్మన్, అక్కడ లబ్ధి పొందాలని నేపముతో ఉన్న మరికొందరు మరియు అక్కడ ఉపాధ్యాయులు కలిసి అక్రమంగా దళిత మహిళలను విధుల నుంచి తొలగించారన్నారు.గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని తొలగించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేసి సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలే బాధిత దళిత మహిళలు బోయపర్తి అంజమ్మ, బోయపర్తి సుజాత బోయపాటి సుగుణమ్మ పాల్గొన్నారు.