కాకినాడ : పెద్దాపురం పట్టణం స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నందు మాజీ ఎంపీ జి.వి.హర్ష కుమార్ ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పోటీలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తన కుమారుడు జీవి సుందర్ ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా తన కుమారుడు జీవి సుందర్ ఎన్నికలలో విజయం సాధిస్తే ప్రజలకు ఏం చేయాలి అనే అంశాలను మేనిఫెస్టో రూపంలో తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ఎక్కడ విడుదల చేసింది అని ప్రశ్నించారు. మాయ మాటలు చెప్పి ఓటును అడగడం తప్ప, మేనిఫెస్టోను ఎప్పుడూ అమలు చేయలేదన్నారు. అదేవిధంగా దళితులు యొక్క ఓట్లను చీల్చేందుకే ఇతర ఎమ్మెల్సీ అభ్యర్థులను పోటీలో నిలబెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మండల అధ్యక్షుడు బొబ్బరాడ సత్తిబాబు, జి.రాగంపేట సర్పంచ్ బొంగ శేఖర్బాబు, ఎమ్మార్పీఎస్ నాయకులు అరుణ్, బహుజన పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజవర్గం ఇంచార్జ్ ఖండవల్లి నాయకులు లోవరాజు, బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర, దళిత నాయకులు పాల్గొన్నారు.

previous post