Tnrnews.in
తెలంగాణ

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ● ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 71వ జన్మదిన వేడుకలను చేవెళ్ల మున్సిపల్ కేంద్రంతో పాటు, మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, సీనియర్ నాయకులు దేశమోళ్ల ఆంజనేయులు, మంగళి బాల్ రాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కేంద్రంలోని శంకర్ పల్లి చౌరస్తాలో కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, సీనియర్ నాయకులు దేశమోళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ.. తెలంగాణ సాధించడంతో పాటు తెలంగాణ రూపు రేఖలను మార్చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణకు మార్గదర్శి, జాతిపిత కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ ఉన్నంత కాలం ఆయన చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే లబ్ది పొందాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అంజన్ గౌడ్, విఘ్నేష్ గౌడ్, కర్నే శివ ప్రసాద్, నర్సిములు, వంగ శ్రీధర్ రెడ్డి, దండు సత్యం, వీరాంజనేయులు, పాండు, గోనే కరుణాకర్ రెడ్డి, శేరి రాజు‌‌, కసిరే వెంకటేష్, తోట చంద్రశేఖర్, కుమార్, అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు మరియు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దేశానికే ఆదర్శం సన్న బియ్యం పథకం

TNR NEWS

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

TNR NEWS

జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన  విద్యార్థిని పవిత్రకు బిజెపి గజ్వేల్ పట్టణ శాఖ తరపున సన్మానం 

TNR NEWS

చదరంగం పోటీల్లో విజేత సిద్ధార్థ

TNR NEWS

మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి  ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి 

TNR NEWS

ఉన్నతమైన భవిష్యత్తుకు విద్య పునాది…

TNR NEWS