Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

వికారాబాద్ జిల్లా కల్లెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 98 పిర్యాదులు సమర్పించారని,వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు , ఇరిగేషన్ , భూ సర్వే ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై పిర్యాదులను పరిశీలించారు. ఆన్లైన్ రికార్డు చెక్ చేసి, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి రిపోర్ట్ పంపించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలనీ ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్తానిక సమస్తలు ) సుదీర్, ఆర్ డి ఓ వాసు చంద్ర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మనస్థాపం తో యువతి ఆత్మహత్య 

TNR NEWS

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs

న్యాయమూర్తి పై దాడి హేయమైన చర్య

Harish Hs

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

TNR NEWS

కనుల పండుగగా విజయ గణపతి దేవాలయం వార్షికోత్సవం

Harish Hs

తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి

TNR NEWS