కొత్తపేట : ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు దేవా వరప్రసాద్, గిడ్డి సత్యనారాయణలతోపాటు పలువురు కూటమి నాయకుల కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంపై స్థానిక నాయకులతో సమీక్షించారు. అనంతరం పట్టభద్రులైన ఓటర్ల వద్దకు నేరుగా వెళ్లి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని బండారు శ్రీనివాస్ ఓటర్లను అభ్యర్థించారు.