- పారిశుధ్య కార్మికులను సన్మానించిన నాగబాబు
పిఠాపురం : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పిఠాపురం శాసన సభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ సూచన మేరకు శనివారం పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో వున్న గోకులం గ్రాండ్లో పిఠాపురం పారిశుధ్య కార్మికులను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు, ఎమ్మెల్సీ మరియు శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ పూలమాలలువేసి, దుశ్వాలువాతో సత్కరించారు. వారు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు అంటే జనసేన పార్టీ అధ్యుక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్కి అపారమైన అభిమానం అన్నారు. వారు చేస్తున్న సేవలవల్లే పర్యావరణం చక్కగా ఉంటుందని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారంటే పారిశుధ్య కార్మికులు పాత్ర చాలా కీలకం అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జీ మర్రెడ్డి శ్రీనివాస్, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, చోడవరం ఇంఛార్జ్ పి.వి.యస్.యన్.రాజు, కాకినాడ అర్బన్ డవలప్మెంట్ అధ్యక్షుడు (కౌడా) తుమ్మల రామస్వామి (బాబు), పిఠాపురం మున్సిపల్ కమీషనర్ కనకారావు, జనసేన నాయకులు పిల్లా శివశంకర్, కడారి తమ్మయ్యనాయుడు, సూరవరపు సురేష్, బొజ్జా లోవరాజు (నానాజీ), బి.ఎన్.రాజు, ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మీ, ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా అధికార ప్రతినిధి తో