Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఉచితంగా చికెన్‌, కోడి గుడ్లు పంపిణీ

పిఠాపురం : రోజూ ముక్కలేనిదే ముద్ద దిగదు జనాలకి. అటువంటి జనాలు నేడు కోడి మాంసం తినడం మానేయడంతో చికెన్‌ వ్యాపారస్తులు నష్టపోతున్నారని వారికి మద్దతుగా నిలిచేందుకు పలు చికెన్‌ కంపెనీలు ముందుకు వచ్చి పలు రకాల స్టాల్స్‌ ఏర్పాటుచేసి జనాలను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం కోళ్ళకు బర్డ్‌ ఫ్లూ వైరస్‌ వ్యాప్తి చెందడంతో ప్రజలు చికెన్‌ తినడం మానేశారు. దీంతో చికెన్‌ తినడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదని తునికి చెందిన వేంకటేశ్వర హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో వెంకబ్‌ చికెన్‌ సంయుక్తంగా ఉచిత చికెన్‌ మేళా స్థానిక ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్‌లో పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా బ్రాంచ్‌ మేనేజర్‌ దుర్గా ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ తెలిపిన ప్రకారం 70డిగ్రీల కంటే ఎక్కువ వేడిలో గుడ్లు, కోడి మాంసం ఉండటం వల్ల బర్డ్‌ ఫ్లూ వైరస్‌ చనిపోతుందని, అది తినడం వల్ల ప్రజలకు ఎటువంటి హానీ జరగదన్నారు. పిఠాపురం పట్టణంలో సుమారు 2000 మందికి పైగా చికెన్‌, కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

Related posts

దక్షిణమధ్య రైల్వే జిఎంకు పౌరసంక్షేమసంఘం వినతి

Dr Suneelkumar Yandra

మహిళలందరికీ పెద్ద పీట వేసింది జనసేన పార్టీ

కమ్మేసిన మంచు దుప్పటి

Harish Hs

భక్తుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు

Dr Suneelkumar Yandra

ఆవిర్భావ సభ అనంతరం ప్రాంగణం, పరిసరాలు శుభ్రం చేసే బాధ్యత తీసుకొంటున్నాము

Dr Suneelkumar Yandra

మార్చి 14న జరగబోయే జనసేన ఆవిర్భావ సభకు ప్రజలందరినీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్న

Dr Suneelkumar Yandra