కాకినాడ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మహర్షి బులుసు సాంబమూర్తి (4.3.1886 – 2.2.1958) మహాశివరాత్రి రోజున జన్మించిన తిథి ప్రకారం 139వ జయంతి సందర్భంగా పౌర సంక్షేమ సంఘం పుష్పమాలతో నివాళులర్పించింది. పిఆర్ కాలేజీ జంక్షన్ లోని సాంబమూర్తి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. 30ఏళ్ల క్రిందట మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాల వ్యవస్థాపకులు దివంగత తటవర్తి శ్రీనివాసరావు కృషితో కాంస్య విగ్రహం ఏర్పడటం వలన జయంతి వర్ధంతి రోజుల్లో వారి సేవలను ఘనంగా గుర్తుచేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. నిస్వార్థ దేశభక్తునిగా జీవితాన్ని, కుటుంబాన్ని, ఆస్తిని సర్వస్వం త్యాగం చేసిన సాంబమూర్తి జీవితం దేశచరిత్రలో కాకినాడకు ఎనలేని ఖ్యాతిని ప్రముఖంగా నిలిపిందన్నారు.