Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

క్రీడలు స్నేహ భావాన్ని పెంపొందిస్తాయి

కోదాడ పట్టణంలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని కటకమ్మ గూడెం రోడ్డులో గల గ్రౌండ్లో కోదాడ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి తో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు.నేటి యువత చదువుతోపాటు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకొని క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడాకారులకు క్రీడల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, మొదటి బహుమతి దాత రాజేష్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్, కర్ల సుందర్ బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు పంది తిరపయ్య, షేక్ మస్తాన్ నిర్వాహకులు లాజర్,భరత్, కోటేష్, సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు

Related posts

మంత్రి కొండా సురేఖను కలిసిన వరంగల్ మార్కెట్ వర్తక సంఘం ప్రతినిధులు 

TNR NEWS

*మాలల సింహాగర్జనను విజయవంతం చేయాలి* ● సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో సింహగర్జన వాల్ పోస్టల్ ఆవిష్కరణ

TNR NEWS

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

TNR NEWS

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS

రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం

TNR NEWS

కార్యకర్తలను కలుపుకొని బిజెపిని గెలుపు తీరాలకు చేరుస్తా… -పెద్దపల్లి మండల నూతన అద్యక్షుడు రమేష్

TNR NEWS