November 16, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

డ్రగ్స్,సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ శుక్రవారం మండల కేంద్రం లోని మోడల్ స్కూల్ పాఠశాల మరియు కళాశాల లో సైబర్ నేరాల పైన, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై,పోలీసు కళా బృందం తో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఏఎస్ఐ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అధ్వర్యంలో సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి,సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దు, బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలుపవద్దని ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు.సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు.వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డిపి లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు.గంజాయి మత్తు మందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు              

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు.యువత లోన్ యాప్ లకు దూరంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలకు రక్షణగా బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలని అన్నారు. అనంతరం పోలీసు కళా బృందం వారు చక్కటి సాంస్కృతిక, పాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం నందు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బూర సైదయ్య గౌడ్

,పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ శివ కోటేశ్వరరావు, మహిళా కానిస్టేబుల్ జ్యోతి, కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, గురులింగం, క్రిష్ణ,చారి, నాగర్జున మరియు విద్యార్థులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే

TNR NEWS

ఆకుపాముల గ్రామంలో బడిబాట కార్యక్రమం

TNR NEWS

రైతు భరోసా కు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం  టిఆర్ఎస్ ప్రభుత్వం లోని రైతులు కళ్ళలో ఆనందం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

TNR NEWS

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

TNR NEWS

హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకై చలో కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి * ములుగుమండల సిఐటియు నాయకులు ఎర్రోళ్ల మల్లేశం 

TNR NEWS

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

Harish Hs