సమాజంలో ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నమ్మాది వెంకటేశ్వర్లుకొలిశెట్టి యాదగిరి రావులు అన్నారు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవన్లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో మునగాల మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన నందిపాటి వెంకటేష్ పెన్ పహాడ్ మండలం చీదేళ్ల గ్రామానికి చెందిన రెడపంగి తేజశ్రీల ఆదర్శ వివాహం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్న కానుకల పేరుతో పేదల కుటుంబాలపై ఆర్థిక భారాలు పడి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో ఈ విధంగా ఆదర్శవంతంగా కట్న కానుకలు లేకుండా హంగు ఆర్భాటాలు లేకుండా ఆదర్శ వివాహం చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఆదర్శ, కులాంతర వివాహాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న దంపతులు కుటుంబాలకే పరిమితం కాకుండా సమాజ మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు మూడవిశ్వాసాలకు వ్యతిరేకంగా, సమాజ అభ్యున్నతికి పాటుపడే విధంగా జీవించాలని తెలిపారు. ఈ వివాహ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల వెంకన్న టిపిడిఎల్ఎఫ్ జిల్లా కార్యదర్శి జే నరసింహారావు సిపిఎం టూ టౌన్ కార్యదర్శి నాగమణి నర్సింహులగూడెం మాజీ సర్పంచ్ నందిపాడు వెంకన్న ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు నందిపాటి సతీష్ నాగేంద్రబాబు నాయకులు గోపాల్ దాస్ శ్రీరాములు నందిపాటి శేఖర్, మహేష్, బన్నీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

previous post