Tnrnews.in
తెలంగాణ

రైస్ మిల్లుల కాలుష్యం నుండి ప్రజలను కాపాడాలి

రైస్ మిల్లుల నుంచి వెలువడే కాలుష్యం నుండి తమను కాపాడాలని కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర,లక్ష్మీపురం కాలనీ ప్రజలు మంగళవారం సూర్యపేట జిల్లా కలెక్టర్, నల్గొండ పొల్యూషన్ బోర్డు అధికారులను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ మాట్లాడుతూ కోదాడ,ఖమ్మం జాతీయ రహదారిని అనుకోని వున్నా శ్రీ లక్ష్మీ శ్రీనివాస, రాధాకృష్ణ, రాజ్యలక్ష్మి, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఇండస్ట్రీ, పార్ బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి మురుగునీరు, బూడిద వ్యర్థ పదార్థాలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని శ్వాస కోస సమస్యలు తలెత్తుతున్నాయని అదేవిధంగా రోడ్డుపై వెళ్లే వాహనదారులు బూడిద కళ్ళలో పడి అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. తాము మిల్లుల యజమానులను కలిసి ఎన్ని సార్లు విన్నవించిన సమస్యను పరిష్కరించడం లేదన్నారు. కావున అధికారులు కలుగజేసుకొని వెంటనే స్పందించి మిల్లులను మూసి వేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బొల్లు ప్రసాద్, సిరిపురపు హేమ, సట్టు వీరస్వామి, వెలీదే పద్మ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు…….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అజీమ్ ఘన విజయం

TNR NEWS

నేటి సాంకేతికత రేపటికి సాంకేతికత కు పునాది  ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది… జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు  బాల వైజ్ఞానిక ప్రదర్శనలు సృజనాత్మకతకు ప్రతీకలు ఉపాధ్యయులు ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలి  కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారంతో వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం భళా… బాలల సైన్స్ ప్రయోగాలుజిల్లా విద్యాశాఖ చరిత్రలో కోదాడ విద్యా బాల వైజ్ఞానిక ప్రదర్శన మైలు రాయి….డీఈఓ అశోక్

TNR NEWS

మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి……  జనవరి 19న జరిగే మాదిగల గర్జన సభను విజయవంతం చేయాలి……. ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలి……. ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతాబాబు మాదిగ…….

TNR NEWS

ఎమ్మార్పీఎస్ వెంకటరామాపురం గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

స్వర్ణకారులపై పోలీసుల వేధింపులు సరైనది కాదు

Harish Hs

ఆసక్తి గల రైతులు మట్టి నమూనాలు అందించండి…

TNR NEWS