సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె. నరసింహను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సన్ ప్రీత్ సింగ్ డీఐజీగా ప్రమోషన్ రావడంతో వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బదిలీ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఎంతో కృషి చేశారు.