రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ భాషా పండితుల ఆత్మీయ రజతోత్సవ సమావేశం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ పట్టణంలోని బాలుర హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు ఎండి అబ్దుల్లా పాల్గొని మాట్లాడారు. 2005/1 యాక్ట్ ను రద్దు చేయించి సీనియారిటీ వచ్చే విధంగా గా మరియు సర్వీస్ రూల్స్ ను మార్చి ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా డిప్యూటీ డిఈవోలుగా ప్రమోషన్లు వచ్చే విధంగా కృషి చేస్తామని అదేవిధంగా మిగిలిపోయిన భాషా పండితులకు అప్ గ్రేడ్ చేయించి పదోన్నతులు ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న తెలుగు, హిందీ, ఉర్దూ పీఈటీలకు 12,000 మందికి ప్రమోషన్లు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషికి గాను ఈ సభలో ధన్యవాదాలు తెలియజేశారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నాగుల బిక్షపతి, లక్ష్మీనారాయణ, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు బషీర్, సీతారామ శర్మ, పద్మావతి, ఫాతిమా, మోతిలాల్, రాములు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు రవీంద్ర, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాసరావు, కృష్ణవేణి, చిన్నప్ప, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు………