అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి శివారులో నల్లమల అడవిలో వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తోంది. గతంలో కురిసిన వర్షాలతో ఇక్కడ నీటి ప్రవాహం పెరిగి చూపరులను ఆకట్టుకుంది. పచ్చని అడవి, కొండపై నుంచి జాలువారే నీటి సవ్వడులు పర్యటకులను కట్టి పడేస్తున్నాయి. ఎత్తైన కొండలు, దట్టమైన అడవి గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.