డీఎస్సీ2024 ద్వారా కొత్తగా నియామకమైన ఉపాధ్యాయుల నుండి కొడంగల్ ఎస్ టి ఓ శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టి యస్ యుటిఎఫ్ వికారాబాద్ జిల్లా lఅధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటరత్నం, ఎ రాములు జిల్లా ఖజానా అధికారి (డి.టి.ఓ )కు ఫిర్యాదు చేశారు కొడంగల్ ఎస్ టి ఓ పరిధిలోని దౌల్తాబాద్, కొడంగల్ ,బొమ్రాస్పేట్ దుద్యాల మండలాలలో నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయుల నుండి స్కూల్ కాంప్లెక్స్, ప్రధానోపాధ్యాయులు బిల్లులు నిర్వహించే సీఆర్పీలు ఉపాధ్యాయులు అక్రమంగా నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయుల నుండి ఒక్కొక్కరి నుండి 800 నుండి 1000 రూపాయల వరకు ఎస్ టి ఓ గారి పేరుతోవసూలు చేస్తున్నారని గారు వీరి అక్రమాల లను నివారించి సంబంధిత ఎస్ టి ఓ పై పాఠశాలల నుండి బిల్లులు నిర్వహిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బసప్ప శీను తదితరులు పాల్గొన్నారు.