ఈనెల 9 నుండి 16 వరకు జరుగుతున్న రేపాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా నరసింహుల గూడెం కెసీఎం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను ఈరోజు గ్రామ సీనియర్ క్రికెట్ ప్లేయర్ మేకల రామారావు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో క్రీడాకారులనూ ప్రోత్సహించడం కోసం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడలలో నైపుణ్యం ప్రతిభగల క్రీడాకారులు ఇలాంటి పోటీలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ క్రీడలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రికెట్ పోటీలలో పాల్గొని విజేతలైన వారికి మొదటి బహుమతి 12116/- ద్వితీయ బహుమతి 8116/-తృతీయ బహుమతి 5116/- చతుర్ద బహుమతి 4116 /-వీటితోపాటు బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ ఫీల్డర బెస్ట్ ఆల్ రౌండర్ లకు 1016/- చొప్పున బహుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు6302004490,8374695622 సెల్ నెంబర్లను సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో నరసింహుల గూడెం గ్రామ క్రికెట్ ప్లేయర్స్ మెంతబోయిన కృష్ణ పెద్ది సురేష్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గోబ్బి నాగరాజు మద్దెల జాను గ్రామ పెద్దలు సోమపంగు నరసయ్య డిఎస్పి మండల కన్వీనర్ పెడమర్తి నరేష్ సోమపంగు లక్ష్మీనారాయణ చిర్రసాగర్ కాంపాటి వీరబాబు క్రికెట్ పోటీల నిర్వాహకులు కాంపాటి సుధీర్ సోమపంగు సాయి తేజ పోకల ఉప్పలయ్య సోమపంగు వెంకటేశ్వర్లు సోమపంగు వరుణ్,నందిపాటి వెంకటేష్,పోకల వీరబాబు,పల్లి రవీందర్,పెద్ది వీరబాబు,దొడ్డ వినయ్,చింతలపాటి అనిల్, చిర్రా వెంకటేశు కోట సిద్దు తదితరులు పాల్గొన్నారు.
