తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పడిదల రవికుమార్ రవికుమార్ అన్నారు.శనివారం కోదాడ పట్టణంలో నియోజవర్గ ఇన్చార్జి బనాల అబ్రహం మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిమూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో మాట ఇచ్చి నేటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య ఆధ్వర్యంలో జనవరి 19న తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలను ఏబిసిడిలుగా విభజించాలని జరిగే మహాసభకు గ్రామ, గ్రామాన మాదిగలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ చేపట్టే దాకా మాదిగలు అంతా ఐక్యంగా ఉండి ప్రజలను చైతన్యపరచి ఈనెల 20 నుండి రాష్ట్రవ్యాప్తంగా జరిగే పాదయాత్రలు,సైకిల్ యాత్రలు, ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని మాదిగలను ఐక్యం చేసి చైతన్య పరచాలన్నారు.ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని మాదిగ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరికంటి అంబేద్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జానయ్య మాదిగ, జిల్లా కార్యదర్శి బొల్లెపొంగు స్వామి,కోదాడ మండల అధ్యక్షులు నారకట్ల ప్రసాద్, చిలుకూరు మండల అధ్యక్షులు కాశయ్య, చింత సైదులు మాదిగ, స్టూడెంట్ ఫెడరేషన్ కోదాడ నియోజకవర్గ నాయకులు పిడమర్తి బాబురావు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు………….