కోదాడ పట్టణంలో ఉన్న ఆదిత్య స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా.. ఆదివారం స్థానిక కోదాడ పట్టణంలో ఉన్న హుజూర్ నగర్ రోడ్డు లో ఉన్న శ్రీ రస్తు ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. యాన్యువల్ డే కార్యక్రమంలో చిన్న పిల్లల ఆట పాటలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతీథులుగా డాక్టర్ గౌరీ నాథ్, డాక్టర్ నిర్మల, కౌన్సిలర్ సుశీల రాజు, మరియు ఈనాడు పుల్లయ్య , గంధం బంగారు బాబు హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సందర్భంగా మాట్లాడారు. చిన్నపిల్లల మానసిక ఉల్లసానికి ఎంతగానో ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది ఎంతగానో హర్షించదగ్గ విషయం అని ఈ సందర్భంగా ఆదిత్య స్కూల్ యాజమాన్యాన్ని మరియు టీచర్స్ ను అభినందించారు. విద్యార్థులకు చదువుతోపాటు ఆటపాటలు కూడా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ కొండపల్లి హైందవి, గూడూరు అంజలి, మహబూబా, శ్వేత, వనిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
