కోదాడ నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ తోనే సాధ్యం అని కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణం లోని శకుంతల థియేటర్ సెంటర్ లో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు అభివృద్దే ఆశయంగా,నియోజక వర్గ ప్రజలే కుటుంబంగా చూసుకుంటున్న నాయకురాలు ఉత్తం పద్మావతి అన్నారు. వేల కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధికి మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కు అండగా ఉంటామన్నారు. ప్రజల సంక్షేమం కోసం అన్నింటినీ త్యాగం చేసి నిరంతరం ప్రజల కోసం తపిస్తున్న నాయకులు మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లు అన్నారు ఎమ్మెల్యే పద్మావతి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పద్మావతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్, మాజీ కౌన్సిలర్లు పెండం వెంకటేశ్వర్లు, కాజా, మైనుదీన్, రావెళ్ల కృష్ణారావు, వేమూరి విద్యాసాగర్, ఆవుల రామారావు, కారింగుల అంజన్ గౌడ్, గంధం పాండు, రాయపూడి వెంకటనారాయణ, ముస్తఫా, చందు నాగేశ్వరరావు, నెమ్మాది ప్రకాష్, దేవమణి, రహీం, శత్రుజ్ఞ, ఖాజా గౌడ్, కర్రీ సుబ్బారావు, సుధాకర్, సయ్యద్ బాబా, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.