కాకినాడ : రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో 33సంవత్సరాల సర్వీస్ చేసిన ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వెయ్యి నుండి పదహారు వందల రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తున్నదని స్థిరాస్తులు, నెలసరి ఆదాయం లేని కుటుంబాలు తల్లడిల్లుతున్న దుస్థితిని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు, వృద్యాప్య ఫించన్లు కల్పించే చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. రిటైర్డ్ ఉద్యోగిగా ప్రభుత్వ పథకాలు అందని నిబంధనల కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నెలసరి ఆర్థిక భరోసాలేక వృద్దాప్యంలో అనారోగ్యాలతో అవస్థలు చేందుతున్నారన్నారు. ప్రభుత్వ వృద్ధాప్య ఫించన్ దారులకు రూ.4వేలు లభిస్తుండగా, ప్రభుత్వ ఆర్.టి.సి రిటైర్డు ఉద్యోగులకు వెయ్యి రూపాయల ఫించన్ మాత్రమే వస్తున్నదన్నారు.