Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

నల్లమల అడవుల్లో ప్రసిద్ధిచెందిన.. కాశి నాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించాలి

కాకినాడ : నల్లమల అడవుల్లో ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగించే అవధూత కాశి నాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించాలని కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ వ్రాసింది. నాలుగున్నర దశాబ్దాలుగా  ధార్మిక సేవలు జరుగుతున్న క్షేత్ర వైభవాన్ని భవిషత్తు తరాలకు అందించాలన్నారు. చరిత్ర పూర్వ నుండి దేశంలోని అనేక అటవీ ప్రాంతాల్లో అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు వున్నాయని వాటి నియమాలు నిబంధన లు అమలు చేయడం ద్వారా కాశి నాయన క్షేత్రం కాపాడాలని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు కోరారు. అక్కడ వున్న 13హెక్టార్ల అటవీ భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని మాజీ ముఖ్య మంత్రులు కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్.టి.రామారావు హయాం నుండి కేంద్రాన్ని కోరుతున్న వినతిని ఆమోదించాలన్నారు. ఏకపక్షంగా క్షేత్రంలో జరుగుతున్న కూల్చివేతలను నిలుపుదల చేయాలన్నారు.

Related posts

ఆటో స్టిక్కర్లను ఆవిష్కరించిన మర్రెడ్డి

Dr Suneelkumar Yandra

*వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు* 

TNR NEWS

చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిసిన మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు

Journalist Ratnam

పిర్ల సూర్యనారాయణ మరణం నెల్లిపూడి గ్రామానికి తీరనిలోటు – జనసేన జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సినిమా ట్రైలర్ ఆవిష్కరణ

TNR NEWS

చిల్డ్రన్ మరియు యూత్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్

Dr Suneelkumar Yandra