Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ఉచ్చులోపడి చిరుత బలి కావడంపై విచారణ

  • ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం

 

మంగళగిరి : అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో ఉచ్చులో చిక్కుకొని చిరుత బలయిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పి.సి.సి.ఎఫ్. చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు. పొన్నూటిపాళెం వద్ద ఆడ చిరుత ఉచ్చులోపడిపోయి కొన్ని గంటలపాటు పెనుగులాడి చనిపోవడం, ఆ చిరుత కడుపులో రెండు కూనలు ఉండటం, ఆ కూనలు కూడా గర్భంలో చనిపోయిన విషయాలు పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చాయి. క్షేత్ర స్థాయి నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని, శాఖాపరంగా ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించారు. ఘటన చోటు చేసుకున్న అనంతరం సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందించారనే విషయాన్నీ తెలియచేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోనూ, అటవీ ప్రాంతాన్ని సమీప గ్రామాల్లో జంతువుల కోసం ఉచ్చులు వేసే వేటగాళ్ళు, ఆ తరహా నేరాలు చేస్తున్నవారిపై నిఘా ఉంచాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పొన్నూటిపాళెం ఘటనపై విచారణను పర్యవేక్షించాలని అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావుకి దిశానిర్దేశం చేశారు.

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నిరుద్యోగ సమస్యపై లోకేష్‌తో రాజు మాటామంతి

రైలు ఆహార దందా అంతమిచ్చేందుకు IRCTC కొత్త ప్లాన్!

TNR NEWS

గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు

TNR NEWS

నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం

Dr Suneelkumar Yandra

అర్ధాంగి – రాక్షసి

TNR NEWS

వేసవి ఎండల్లో కిలో వాట్స్ విద్యుత్ భారాలు తగవు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్