Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

విజయవంతంగా ముగిసిన పిఠాపురం మండల గ్రామముల ఆవిర్భావ సభ సన్నాహక సమావేశములు

  • మూడు రోజులపాటు 24 గ్రామములను పర్యటించిన ఆవిర్భావ సభ సమన్వయకర్త పి.వి.ఎస్.ఎన్.రాజు

 

  • పార్టీ శ్రేణులతో మమేకం, సభ వియజవంతం చేయాలని పిలుపు

పిఠాపురం : జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించబడిన విశాఖ జిల్లా చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్.రాజు తన మూడవ రోజు పర్యటనలో భాగంగా చిత్రాడ, నవకండ్రవాడ, మాధవపురం, బి.ప్రత్రిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం గ్రామాలను పలువురు మండల నాయకులతో కలసి సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన పలువురు గ్రామ పార్టీ నాయకులను, సీనియర్ నాయకులను, వీర మహిళలను కలిసి పవన్ కళ్యాణ్ నాయకత్వం మన ప్రాంతానికి ఎంత మేలు చేస్తుందో ముఖ్యంగా పిఠాపురం నియోజవర్గం అభివృద్ధి పథంలో ఎలా దూసుకుపోతుందో వారి ద్వారా తెలుసుకొని పూర్తిస్థాయిలో ఈ సభను విజయవంతం చెయ్యడానికి ప్రజలందరినీ కలిసి వారిని ఈ పండగ మహోత్సవంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఈనాటి సమావేశాల్లో పలువురు పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొని పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల తమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న విధానం పట్ల తమ సంతోషాన్ని తెలియజేసి ఎల్లప్పుడూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలుస్తామని జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పిఠాపురం నియోజకవర్గ పార్టీ శ్రేణులు అండగా నిలుస్తాయని తెలియజేశారు. తదుపరి ఆయా గ్రామాల నాయకులతో కలిసి అక్కడ ఉన్న కొంతమంది ప్రజలకి ఆవిర్భావ సభ కరపత్రికలను అందజేయడం జరిగింది. ఈ పర్యటనలో ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ వూటా ఆదివిష్ణు (నానిబాబు), ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, జనసేన నాయకులు వెన్నా జగదీష్, వెన్నపు చక్రధరరావు, పిల్లా దినేష్, తుమ్మలపల్లి చందు, కురుమళ్ల రాంబాబు సిగటాపు నారాయణరావు, ఎంపీటీసీ దూలపల్లి రత్నం నంద్యాల జాన్, దేశిరెడ్డి సతీష్, దూలపల్లి నాగబాబు, బసవ గోపి, కోటిపల్లి కాశీ విశ్వనాథ్, పెంట వెంకటేష్, తేలు శ్రీనివాస్, గాది వెంకటేష్, నాయుడు మణికంఠ, వెన్న రాంబాబు, పేర్నిడి వెంకట్రావు, కండవల్లి రమణ, కుక్కల బాబు, యాగ సతీష్, ఆకుల దుర్గ, ‍మేడిశెట్టి, నాగమణి, నాగిని, అరుణ, అమ్మాజీ, కందా సత్యనారాయణ, కోన లోవరాజు, బసవ నాగలోవబాబు, పిల్లి శ్రీనివాస్, వల్లి దుర్గ బాబు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related posts

చిల్లపల్లి ఆధ్వర్యంలో పిఠాపురం.. జయకేతనం సభాప్రాంగణం వద్ద స్వచ్ఛభారత్

Dr Suneelkumar Yandra

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ

Dr Suneelkumar Yandra

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

TNR NEWS

నేపాల్‌లో చిక్కుకున్న మంగళగిరి వాసుల కుటుంబాలను పరామర్శించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

Dr Suneelkumar Yandra

ప్రజా సేవే పరమావధిగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

స్వయం ఉపాధి అవకాశాలపై ఉచిత శిక్షణ

Dr Suneelkumar Yandra