పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, యు. కొత్తపల్లి, పిఠాపురంలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైంది. పిఠాపురంలో ఆర్ఆర్బీహెచ్ఆర్ నందు ఆరు పోలింగ్ కేంద్రాలు, గొల్లప్రోలు పట్టణంలో శివారు జడ్పీ బాలురు ఉన్నత పాఠశాల నందలి మూడు పోలింగ్ కేంద్రాల్లో, యు కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని మూడు పోలింగ్ కేంద్రాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.