- జనసేనని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు భారీగా తరలివచ్చిన జన శ్రేణులు
- జన సైనికులు తలుచుకుంటే క్షణాల్లో గ్రౌండ్ శుభ్రపరుస్తాం – చిల్లపల్లి శ్రీనివాసరావు
పిఠాపురం : పిఠాపురంలోని చిత్రాడ వద్ద జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం సభా ప్రాంగణాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 10 గంటలకు ఎపిఎంఎస్ఐడిసి చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆయన అనుచరులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపుమేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చామని, జనసైనికులు తలుచుకుంటే కొద్ది గంటల్లోనే సభ ప్రాంగణాన్ని మొత్తం క్లీన్ చేస్తారని, అందరూ పాల్గొని జనసైనికుల పవర్ అంటే ఏంటో తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ రామ్మోహన్ రావు, ఏపి పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసుధానరావు, మంగళగిరి నియోజకవర్గ యువజన నాయకులు చిట్టెం అవినాష్, ఎంటీఎంసి కార్యదర్శి షేక్ వజీర్ భాష, జనసేన పార్టీ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, జొన్న రాజేష్, తిరుమలశెట్టి గోపీనాథ్, చిల్లపల్లి యూత్ అధ్యక్షుడు మేకల సాయి తదితరులు పాల్గొన్నారు.