అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల హెల్త్ సిటీలో ఏర్పాటు చేసిన ‘అపోలో చెస్ట్ పెయిన్ క్లినిక్’ను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో యువత గుండెపోటు బారిన పడుతున్నారని చెప్పారు. గుండె సంబంధిత సమస్యలు వస్తే నిపుణులను సంప్రదించడం అత్యవసరం అన్నారు. కార్డియాక్ మరణాలను నివారించడానికి ఈ క్లినిక్ ఉపయోగపడుతుందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా అపోలో సేవలు విస్తరించాలని సూచించారు.ఆరోగ్యంపై అవగాహన కల్పించాలన్నారు.మహిళా రక్షణకు ఎన్డియే ప్రభుత్వం అధిక ప్రాదాన్యత ఇస్తుందని చెప్పారు. పోలీస్ డిపార్టమెంట్ కు టెస్ట్ లు చెయ్యాలని మంత్రి కోరగా,అపోలో యాజమాన్యం సానుకూలంగా స్పందించారు.
next post